ధ్రువంత్ సొల్యూషన్స్‌లో 50 ఉద్యోగాలకు జాబ్ మేళా
కాకతీయ, హనుమకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం తెలిపింది. ధ్రువంత్ సొల్యూషన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న 50 ఉద్యోగాలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. టీమ్ లీడర్, టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళా అభ్యర్థులు అర్హులు. డిగ్రీ, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఉద్యోగ స్థలం హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఉంటుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 7893394393 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సూచించింది.

