epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం
అటవీ సంరక్షణకు పోలీసు, అటవీ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి కార్యాచరణ
గుత్తికోయలకు ప్రత్యామ్నాయ ఉపాధి
ములుగు పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ
రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్
కాకతీయ, ములుగు: అటవీ సంపదను కొల్లగొట్టే, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారులకు స్పష్టం చేశారు. వన్యప్రాణుల వేట, అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం, పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి సంయుక్త కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి తాడ్వాయి అటవీ ప్రాంతం, ఏటూరునాగారం అభయారణ్యం, జలగలంచ దుర్గం గుట్ట, కొండాయి ఫారెస్ట్ వాచ్ టవర్ ప్రాంతాలను సందర్శించారు. అటవీ సంపద, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఇటీవల అడవి దున్నను వేటాడిన ఘటనను ప్రస్తావిస్తూ ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడంతోపాటు వాటి వెనుక ఉన్న కారణాలను సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించాలని, అగ్ని ప్రమాదాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అడవుల విధ్వంసానికి అడ్డుకట్ట.. ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రాధాన్యం
 గుత్తికోయల నివాస ప్రాంతాన్ని సందర్శించిన జయేశ్ రంజన్ వారి జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాలను స్వయంగా పరిశీలించారు. అడవులను నరికివేయకుండా జీవనోపాధి పొందేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించవచ్చనే అంశంపై అధికారులతో చర్చించారు. అటవీ సంపదకు నష్టం కలిగించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. గుత్తికోయలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను గుర్తించి, అటవీ సంరక్షణకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటూరునాగారం అభయారణ్యాన్ని మరింత సమర్థంగా సంరక్షిస్తూ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు. ములుగు జిల్లాలోని దట్టమైన అడవులు, ప్రకృతి అందాలు, జీవవైవిధ్యం, చారిత్రక ప్రాంతాలు పర్యాటక అభివృద్ధికి ఎంతో అనుకూలమని పేర్కొన్నారు. పర్యావరణానికి నష్టం కలగకుండా ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఈ పర్యటనలో గుర్తించిన అంశాలపై రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్కతో చర్చించి ఆమె సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన అనంతరం జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావాలపై ముందస్తు వ్యూహం
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చే వరకు వేచి చూడకుండా ముందస్తు సన్నద్ధత చేపట్టాలని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. వచ్చే నెల హైదరాబాద్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఎల్‌నినో ప్రభావాలపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, అటవీ జీవజాలంతోపాటు అధిక ఉష్ణోగ్రతల్లో ఆరుబయట పనిచేసే కార్మికులు, గిగ్ వర్కర్లపై పడే ప్రభావాలను సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. నిపుణుల సలహాలు, ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తక్షణ, ఏడాది, ఐదేళ్ల కాలానికి అనుసరించాల్సిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అటవీ సంరక్షణ నుంచి వాతావరణ మార్పుల ఎదుర్కొలుపు వరకు అన్ని అంశాల్లో ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత అటవీ శాఖ అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా...

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి 90 శాతం పూర్తయిన నిర్మాణ...

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ పరశురాములు కాకతీయ, పెద్దవంగర...

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా 

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా  పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్   కాకతీయ,రాయపర్తి : బీసీల...

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ...

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.