epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!
జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు
సంక్షేమ పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
జీవో రద్దయ్యే వరకు దశలవారీ ఉద్యమం
మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌
కాకతీయ, హ‌న్మ‌కొండ : బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. జీవో నంబర్‌ 14లో మార్పులను నిరసిస్తూ శుక్రవారం కేయూ జంక్షన్‌ ఎస్డీఎస్సీ వద్ద మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం సమీపంలో బీసీ ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. బీసీల ఆత్మగౌరవ భవనాలు, సంక్షేమ పథకాలు, కులవృత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఏటా బీసీ సంక్షేమానికి రూ.20 కోట్లు కేటాయించాల్సి ఉండగా, బడ్జెట్‌లో ఎంత నిధులు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 42 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో కేటాయించిన భూముల్లో బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి జీవో 14 అడ్డంకిగా మారుతోందని, దాని వెనుక ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, బీసీలకు బీసీ బంధు ద్వారా ఆర్థిక చేయూత అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా బీసీల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. నేత కార్మికుల సహకార సంఘాలకు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడం లేదని, చెరువుల నిర్వహణలో నిర్లక్ష్యంతో మత్స్యకార కుటుంబాల ఉపాధి దెబ్బతింటోందని అన్నారు.
జీవో 14 రద్దు చేయాల్సిందే
సర్దార్‌ సర్వాయి పాపన్నతో పాటు వివిధ బీసీ కులాల ప్రముఖుల జయంతి వేడుకలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమాలకు వచ్చే వారికి తాగునీరు, టీ, అల్పాహారం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ భవనాల భూముల విషయంలో పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. జీవో 14ను రద్దు చేసే వరకు దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ, దళిత విద్యార్థులు, కుల సంఘాలు ఐక్యంగా పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫూలే ఆశయాల స్ఫూర్తితో బీసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్‌...

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి! హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదుల వినతి న్యాయస్థాన సాధన సమితి...

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు...

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు 

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు  రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదాల నీడలో ప్రయాణికులు ఆర్టీసీ...

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌ 27.6 కిలోల ఎండు గంజాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.