బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్ పరశురాములు
కాకతీయ, పెద్దవంగర : బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ పరశురాములు అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఏ బాలుడికి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి అండగా నిలవాలని, వారి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. బాలల సమస్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యత గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీపై ఉందన్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. గ్రామంలో కమిటీ ఏర్పాటు బాలల భద్రత, అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ శోభ, హైస్కూల్ హెచ్ఎం శేషవల్లి, అంగన్వాడీ టీచర్లు సుకన్య, అరుణ, వెంకటలక్ష్మి, ఏఎన్ఎం శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి వనిత తదితరులు పాల్గొన్నారు.

