epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏజెన్సీ ఎస్సీలకు రిజర్వేషన్లలో అన్యాయం

ఏజెన్సీ ఎస్సీలకు రిజర్వేషన్లలో అన్యాయం
మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్

కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో కలపడం ద్వారా ఎస్సీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుర్గం నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి న్యాయసమ్మతమైన పరిష్కార మార్గాన్ని సూచించాలని కోరారు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా భూభాగం ఏజెన్సీ ప్రాంతమేనని, ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎస్సీ జనాభా తీవ్ర అభివృద్ధి లోపాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌ను జనరల్ కేటగిరీలో కలపడం వల్ల వెనుకబడ్డ ఈ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నిర్మాణానికి ముందు ఏజెన్సీ మండలాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులో ఉండటం వల్ల ఎస్సీలకు తగిన అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాధించిపెట్టిన రాజ్యాంగ హక్కులను కాపాడాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని హితవు పలికారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లను పునరుద్ధరించి, రాజ్యాంగం కల్పించిన నిజమైన ప్రాతినిధ్యం ఎస్సీలకు అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.