epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం
మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

కాకతీయ, వరంగల్ సిటీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి చివరకు 17 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ బీసీల‌ను వంచ‌న‌కు గురి చేసింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ ఓట‌ర్లు బ్యాలెట్‌తో స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మెజారిటీ పంచాయతీలను గెలిపించుకోవాల‌ని గంట రవికుమార్ పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మంగళవారం హ‌సన్ పర్తి మండల పరిధిలోని జయగిరి, మడిపల్లి, ఐనవోలు మండలలోని పంతిని, నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామల సర్పంచ్, వార్డు మెంబర్లుగా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయించారు. ఈసంద‌ర్భంగా ర‌వికుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని అన్నారు. అందుకే వరంగల్ జిల్లా బీజేపీ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. గ్రామ వార్డు మెంబర్ స్థాయి నుంచి జ‌డ్పీటీసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను (మహాలక్ష్మి, రైతు భరోసా వంటివి) అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్ర‌చారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, పార్లమెంట్ కన్వీనర్ తాళ్ళపెల్లి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, రేసు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శి జడ సతీష్, రాధాకృష్ణ, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, హాసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి, తడక వినయ్, గూడూరు సందీప్, టి.అంబేద్కర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.