epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క‌న్న‌త‌ల్లి కర్కశత్వం.. ప‌సికందును కాపాడిన వీధి కుక్క‌లు!

క‌న్న‌త‌ల్లి కర్కశత్వం.. ప‌సికందును కాపాడిన వీధి కుక్క‌లు!
పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘ‌ట‌న‌
న‌వ‌జాత శిశువును రోడ్డుపై వ‌దిలేసిన క‌న్న‌త‌ల్లి
రాత్రంతా బాడీగార్డుల్లా నిలిచిన వీధి కుక్కలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్ పట్టణం తాజాగా హృదయాన్ని కదిలించే సంఘటనకు వేదికైంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన‌ తల్లి కన్నబిడ్డ ప‌ట్ల‌ కర్కశంగా వ్యవహరిస్తే.. వీధి కుక్క‌లు మాత్రం ఆ బిడ్డ‌కు బాడీ గార్డుల్లా మారి ప్రాణాలు కాపాడాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నదియా జిల్లాలోని రైల్వే వర్కర్ల కాలనీ పబ్లిక్ టాయిలెట్ ముందు పసికందును వ‌దిలేసి మాన‌వ‌త్వాన్ని మర్చిపోయిందో క‌న్న‌త‌ల్లి. బిడ్డపై రక్తపు మరకలు కూడా పోలేదు. అంటే పుట్టిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డుపై వదిలేశారు.

ఆ బిడ్డ జీవితం అక్కడితో ముగిసిపోయేదేమో.. కానీ అద్భుతం జరిగింది. రోడ్డుపై సంచరిస్తున్న శునకాల గుంపు ఆ చిన్నారిని గమనించింది. అవి వెంటనే బిడ్డ చుట్టూ నిలబడి రక్షణ వలయంలా మారాయి. సహజంగా మొరగడం, పరుగులు తీయడం చేసే శునకాలు, ఆ క్షణంలో మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా కాపలా కాశాయి. చ‌ల్ల‌టి రాత్రి.. బిడ్డకు దుప్పటి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లోనూ శునకాలు ఆ పసికందు దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా దూరం కాలేదు. చిన్న పురుగు కూడా బిడ్డను తాకకుండా కవచం వలె నిలిచాయి.

అవి రక్షణగా నిలవకపోతే పరిస్థితేమై ఉండేదో ఎవరికీ తెలియదు. బిడ్డను వదిలేసిన తల్లి కంటే, వీధి కుక్కలే ఆ చిన్నారికి నిజమైన ఆశ్రయం అయ్యాయి. ఉద‌యం వీధికుక్క‌ల మ‌ధ్య ఆ ప‌సికందును చూసిన స్థానికుల నోట మాట‌రాలేదు. ఓ మహిళ ధైర్యం చేసి బిడ్డ దగ్గరకు వెళ్లే సరికి, శునకాలు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. “ ఇక ఈ బిడ్డ బాధ్య‌త మీదే.. మా పని అయిపోయింది“ అని చెప్పినట్టుగా వాటి ప్రవర్తన కనిపించింది.

ఇక స‌ద‌రు మహిళ వెంటనే పసికందును ఆసుపత్రికి తరలించింది. నబద్వీప్ చైల్డ్ హెల్ప్ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. సకాలంలో చర్య తీసుకోవడంతో పాటు శునకాల అపూర్వ కాపలాదారణం బిడ్డ‌ ప్రాణాలను కాపాడింది. కన్నతల్లి కర్కశత్వం ముందు, జంతువుల మానవత్వం నిలబడిన రాత్రి అది. మానవ హృదయాలను కదిలించేసిన ఈ నిజ సంఘటన ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.