epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలి

యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలి
రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
యూరియా పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
గ్రోమోర్ ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ
బుకింగ్ ఐడీ కాలమ్‌తో రిజిస్టర్ నిర్వహణకు ఆదేశం

కాకతీయ, జనగాం : రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. ఈ యాప్‌పై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జనగాం పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా యాప్ ద్వారా ఇప్పటివరకు జరిగిన అమ్మకాలను సంబంధిత రిజిస్టర్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పనిసరిగా యూరియా అమ్మకాల రిజిస్టర్ నిర్వహించాలని, ఇందులో కొత్తగా ‘బుకింగ్ ఐడీ’ అనే కాలమ్‌ను ఏర్పాటు చేసి, యాప్ ద్వారా జరిగిన అమ్మకాల పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.

అవకతవకలకు చెక్

ఈ యాప్ ద్వారా ఎరువులు సమయానికి, అవసరానికి తగ్గట్టుగా, ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులకు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకోవడం వల్ల అనవసరంగా ఎరువుల దుకాణాల వద్ద గుమిగూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. అలాగే ఒక రైతు ఒకే చోట లేదా పలు చోట్ల పునరావృతంగా యూరియా కొనుగోలు చేయకుండా నియంత్రణ సాధ్యమవుతుందని వివరించారు.

100 శాతం పారదర్శకత

యాప్ ఆధారిత బుకింగ్ విధానం ద్వారా యూరియా పంపిణీలో న్యాయమైన కేటాయింపు, బ్లాక్ మార్కెటింగ్ నివారణ, 100 శాతం పారదర్శకత సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులందరూ ఈ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని, ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

యూరియా ఎరువుల బుకింగ్ విధానం

ప్లే స్టోర్ నుంచి Fertilizer Booking App డౌన్‌లోడ్
మొబైల్ నంబర్‌తో లాగిన్, OTP నమోదు
పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్ నమోదు
పంట వివరాల (Crop Booking) నమోదు
అనుమతించిన యూరియా సంచుల కోటా ఎంపిక
మండలం, డీలర్ ఎంపిక చేసి బుకింగ్ నిర్ధారణ
బుకింగ్ పూర్తయ్యాక Booking ID జనరేట్
ఆ IDతో డీలర్ వద్ద యూరియా పొందడం
ఈ తనిఖీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, టెక్నికల్ ఏవో శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.