epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం కీర్తిని పెంచేలా మ‌హాజాత‌ర‌

మేడారం కీర్తిని పెంచేలా మ‌హాజాత‌ర‌
యుద్ధ ప్రతిపాదికన పనులను పూర్తి చేయాలి
అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
అధికారుల‌కు మంత్రి సీతక్క ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం కల్వపల్లి నుండి ఊరట్టం వరకు రహదారి పనులను , కల్వర్టు నిర్మాణ పనులను, ఊరట్టం – కొండాయి రహదారిని పనులను, కల్వర్టు నిర్మాణాన్ని , ఆలయ ప్రాంగణం ఫ్లోరింగ్ పనులను,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మేడారం జాతర అభివృద్ధి పనులను శాఖల వారీగా కూలంకషంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని ఉపయోగిస్తూ యుద్ధ ప్రతిపాదికన పడలను పూర్తి చేయాలని, అధికారులు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పనిచేసే జాతరను విజయవంతం చేయాలని సూచించారు. గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. జాతర సమయంలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, తాడ్వాయి, పసర మేడారం చుట్టుపక్కల 10 గ్రామాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని జాతరకు వచ్చే రహదారులకు ఇరువైపులా బోర్ వెల్స్ చేతి పంపులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

జాత‌ర‌లో క్యూలైన్స్ పాత్ర కీలకం

జాతర సమయంలో క్యూలైన్స్ పాత్ర కీలకంగా ఉంటుందని, క్యూలైన్స్, షేడ్స్ నిర్మాణాలలో వేగం పెంచాలని అన్నారు. ములుగు ఘట్టమ్మ వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు కూడా త్వరితగతిని పూర్తి చేయాలని కొత్తూరు నార్లపూర్ రహదారి పనులు, గోవిందరాజుల పూజారుల కోసం ఊరట్టo వద్ద నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని అన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు జాతర అనంతరం కూడా వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సదుపాయాలు అందించాలని, జాతరకు వచ్చే రహదారుల జంక్షన్ లలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, పార్కింగ్ స్థలాలు, ములుగు గట్టమ్మ వద్ద ఫీడింగ్ రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఆర్డీవో వెంకటేష్ , డి.ఎస్.పి రవీందర్ ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.