epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..

‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..
మంగ‌పేట‌లో విద్యుత్ అధికారి ప్రశాంతంగా వసూల్
ట్రాన్స్‌ఫార్మ‌ర్ పెట్టాలంటే డ‌బ్బులివ్వాల్సిందేనంట‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో అక్రమ వసూళ్లు జోరు పెంచిన కిందిస్థాయి విద్యుత్ శాఖ అధికారి రైతులపై ఆంక్షల కుటీల వల నూను గట్టిగా బిగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల కోసం అమలవుతున్న ‘పొలం బాట’ కార్యక్రమాన్ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం ‘వసూళ్ల బాట’గా మలచుకున్నాడనే ఆరోపణలు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగపేట మండలంలోని ఒక రైతు నుండి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పాత యంత్రాల మార్పిడి, లైన్ల మరమ్మతుల వంటి పనుల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు విషయంలో సరాసరి ₹1.50 లక్షలు వరకు వసూలు చేశాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. సాధారణంగా నామమాత్రపు ఖర్చుతో, ప్రభుత్వ విధానాల ప్రకారం రైతులకు అందాల్సిన సదుపాయాలకే భారీ లావాదేవీలు జరిపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ ఏమీ చేయలేరని…

ఇప్పటికే ప్రమోషన్ జాబితాలో ఉన్న తమకై ఎవరూ ఏమీ చేయలేరని, సీఎండీ స్థాయి వరకు పరిచయాలు ఉన్నాయని సదరు ఉద్యోగి సమక్షంలోనే చెప్పుకుంటున్నాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలకు తావివ్వం, నిరూపితమైనా కఠిన చర్యలే అన్న సీఎండీ హెచ్చరికలున్నప్పటికీ ఈ ఉద్యోగిపై మాత్రం చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పొలం బాట’ కార్యక్రమాన్ని వ్యక్తిగత లాభార్జన సాధనంగా మార్చుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. మంగపేట రైతులపై జరిగిందని పేర్కొంటున్న ఈ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి నిజనిజాలు వెలుగులోకి తేవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమంలోనే లంచాల నీడ పడుతుండటం బాధాకరం అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలనే ధ్వని వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.