epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి
విద్యుత్, వైద్యం, పారిశుధ్యలోపం క‌నిపించొద్దు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి సమీక్ష సమావేశం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతంగా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, సాగునీటిపారుదల, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలు గుర్తించి, రైతులతో చర్చించి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇందుకోసం సంబంధిత రైతులకు రూ.5 వేల పరిహారం అందించాలని తెలిపారు. జాతరకు వచ్చే రహదారుల్లో మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భక్తులు స్నానాలు చేసే ఎస్సారెస్పీ కాలువ, అగ్రంపహాడ్ చెరువు వద్ద తగిన నీటి లభ్యత ఉండేలా సాగునీటిపారుదల శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్, వైద్యం, పారిశుధ్య ఏర్పాట్లు

నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోడ్ల వెంట అదనంగా విద్యుత్ స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

జిల్లాలోనే అతిపెద్ద జాతర – కలెక్టర్

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర జిల్లాలోనే అతిపెద్ద జాతర అని, సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. ఇక్కడ దర్శనం అనంతరం మేడారానికి భక్తులు తరలివెళ్తారని చెప్పారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలు పెంపు – ఆలయ ఈవో

ఆలయ ఈవో నాగేశ్వర్ రావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ తరపున జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలతో పాటు ఈ జాతరకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పరకాల ఏసీపీ సతీష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, ఆర్టీసీ డీఎం దరంసింగ్, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, అగ్రంపహాడ్, అక్కంపేట, చౌళ్లపల్లి సర్పంచులు మహేందర్, సాంబయ్య, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.