epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?

“నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?
తెలంగాణను మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్
ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు
కేసీఆర్‌పై దాడులు ఉద్యమంపైనే దాడులు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు

కాకతీయ, జనగామ : “నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చిన నేల తెలంగాణ అయితే, ఆ తెలంగాణను స్వరాష్ట్రంగా మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అనేది కేవలం ఒక వ్యక్తి కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.
జనగామ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం పార్టీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. లాఠీచార్జీలు, అరెస్టులు, కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గని మొండితనం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. అలాంటి నాయకుడిని తక్కువ చేసి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని హెచ్చరించారు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల స్వరమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అహర్నిశలు పోరాడిన నాయకుడని కేటీఆర్ తెలిపారు. ఉద్యమాన్ని పుట్టించిన నాయకుడిని ఇప్పుడు మొలకలతో పోల్చడం అవివేకమని విమర్శించారు. తెలంగాణను మొలకెత్తించిన నేలే కేసీఆర్‌ను నాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు.

కాంగ్రెస్–బీజేపీలపై మండిపాటు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదని, అందుకే నేడు కేసీఆర్‌పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఎంత దూషించినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెక్కుచెదరదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం సాగిన పోరాట చరిత్రను ఎవరూ మార్చలేరని, కేసీఆర్ నాయకత్వంలో మొదలైన ఉద్యమ స్ఫూర్తి ఇంకా కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు తగిన సమాధానం ప్రజాక్షేత్రంలోనే చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.