epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వల్లకాడును వదలరే!

వల్లకాడును వదలరే!
మట్టెవాడలో శ్మశాన వాటికలో కబ్జాపర్వం
ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీడబ్ల్యూఎంసీ అధికారులు
డిప్యూటీ చైర్మన్ బండా, ఎమ్మెల్సీ బస్వరాజు లేఖలతో వెలుగులోకి
వరంగల్ బల్దియాలో అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రభుత్వ భూముల కబ్జాపర్వానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, రహదారులు, మురికి కాల్వలు, నాలాలు, చెరువు శిఖం భూములు మాత్రమే కాదు… చివరకు శ్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ఈ అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) అధికారులే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ప్రతి సోమవారం జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా నగరంలో శ్మశానవాటిక కబ్జాకు గురికావడం… అధికారుల విధుల నిర్వహణలో నిబద్ధతకు నిలువెత్తు ప్రశ్నగా మారింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు వేర్వేరుగా బల్దియా కమిషనర్‌కు రాసిన లేఖలతో ఈ కబ్జా బండారం వెలుగులోకి వచ్చింది.

వల్లకాడులో ఇంటికి అనుమతులా?

వరంగల్ మట్టెవాడ ప్రాంతం సర్వే నంబర్ 442లో శ్మశానవాటిక ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఈ భూమిలో సుమారు 13 గుంటల స్థలాన్ని తొలుత కబ్జా చేసినట్లు సమాచారం. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసిన గుత్తికొండ తిరుపతి… ఆ స్థలాన్ని కరీంనగర్‌కు చెందిన ఏ. దామోదర్, శారద దంపతులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దామోదర్ ఇటీవల ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బల్దియా అధికారులపై నమ్మకం కోల్పోయిన స్థానికులు… చివరకు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలను ఆశ్రయించారు. వారు వెంటనే స్పందించి శ్మశానవాటికలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలంటూ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, వరంగల్ తహసీల్దార్‌కు లేఖలు రాశారు.

అధికారులనే అదరగొట్టిన కబ్జాదారులు!

ప్రజాప్రతినిధుల లేఖలతో బల్దియా కమిషనర్‌, తహసీల్దార్ అప్రమత్తమయ్యారు. తక్షణమే జీడబ్ల్యూఎంసీ టౌన్‌ప్లానింగ్‌, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ ఆర్‌ఐలను సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఇంటి నిర్మాణదారుడు అధికారులనే అదరగొట్టినట్లు సమాచారం. తన వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్వయంగా పరిశీలించి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వాదిస్తూ అధికారులను హడలెత్తించినట్లు తెలుస్తోంది. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని, సర్వే పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాలని చెప్పి టౌన్‌ప్లానింగ్ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చిన పరిస్థితి. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు శిఖం భూముల పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఇది మరో నిలువెత్తు సాక్ష్యంగా మారింది. శ్మశానవాటిక కబ్జా బాగోతం ఇక ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.