epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి

ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా

మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు

రేటింగ్స్ కోసం మానసిక హింసకు గురిచేయొద్దు

ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందన్న విష‌యం గుర్తించాలి

కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలోనే..

సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా

రేప‌టి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదు

మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆవేద‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్న తనపై ఇలాంటి బురదజల్లడం సరికాదని ఆయన మీడియాకు విన్నవించారు. తనను ఎంతైనా విమర్శించవచ్చని.. కానీ అధికారులను వివాదాల్లోకి లాగొద్దని ఆయన కోరారు.

వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం స‌రికాదు

మంత్రి తన ఆవేదనలో ప్రధానంగా మహిళా అధికారుల ఆత్మగౌరవం గురించి ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారని.. కేవలం ఛానళ్ల మధ్య పోటీ కోసం వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తల వల్ల వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం తరపున సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతానని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. తన కుమారుడి మరణం తర్వాత సగం చనిపోయానని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

పాత ఫోన్ నంబ‌రే వాడుతున్నా..

గత కొంతకాలంగా మంత్రి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అమెరికా వెళ్లి వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు తక్కువగా మాట్లాడుతున్నట్లు వివరించారు. తాను ఫోన్ నంబర్ మార్చానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత 20 ఏళ్లుగా వాడుతున్న పాత నంబర్ తన వద్దే ఉందని.. అందరూ ఫోన్లు చేస్తుండటంతో దానిని తన పీఏ వద్ద ఉంచానని క్లారిటీ ఇచ్చారు. ఆ నంబర్ ద్వారానే తాను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో జరుగుతాయని.. ఇందులో మంత్రుల ప్రమేయం ఉండదని చెప్పారు. నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పరిపాలనాపరమైన ప్రక్రియే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు.

సినిమా టికెట్ల ధరల పెంపుపై..

సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై తన దగ్గరకు రావొద్దని చెప్పానని.. దీంతో ఎవరూ తనను కలవడానికి రావడం లేదని చెప్పారు. పుష్ప సినిమా సందర్భంగా ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అప్పటి నుంచే టికెట్ల రేట్ల పెంపు కోసం తన దగ్గరకు రావొద్దని చెప్పానని ఆయన అన్నారు. నిన్నటి సినిమాకు టికెట్ల ధరల పెంపు, రేపటి సినిమాకూ టికెట్ రేట్లు పెంచిన విషయం తనకు తెలీదని చెప్పారు. టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలీదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

అవసరమైతే హెలికాఫ్టర్‌లో తరలిస్తాం..

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బాటిల్ నెక్ ప్లేస్ ఉన్న వద్ద జామ్ ఎక్కువ అవుతోందన్నారు. ఈసారి 12 లక్షల వాహనాలు వెళతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈరోజు నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుందని.. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు టోల్‌ ఛార్జీ లేకుండా గేట్ ఎత్తేయాలని చెప్పామని అన్నారు. ప్రత్యామ్నాయ రూట్స్‌లో ప్రయాణికులు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదం జరిగితే అవసరమైతే హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.