epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్!

ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్!
130 ఎకరాల అభివృద్ధికి భూయజమానుల ముందడుగు
ఆత్మకూరులో 21½ ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తి
మోడల్ లేఔట్ల అభివృద్ధిపై కుడా ఫోకస్
ఊనికిచర్ల వద్ద 145 ఎకరాల్లో ‘యూనిసిటీ’ ప్రాజెక్ట్

కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : హనుమకొండ జిల్లాలో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ఊపందుకుంది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన భూయజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో మొత్తం 130 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. భూముల అభివృద్ధిలో భాగస్వాములుగా మారేందుకు భూస్వాములు చూపుతున్న ఆసక్తితో కుడా ఆశావహంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలానికి చెందిన భూయజమానులు తమ స్వంత భూముల్లోని 21½ ఎకరాలను కుడాకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం గమనార్హం. భూయజమానుల ఈ చొరవను కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్‌పాయి అభినందించారు. భూస్వాముల సహకారంతో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చని వారు పేర్కొన్నారు.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యం

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వేగంగా మారుతున్న రియల్ ఎస్టేట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రణాళికాబద్ధమైన లేఔట్‌ల అభివృద్ధే కుడా ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న భూయజమానులు కుడాను సంప్రదిస్తే, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన మోడల్ లేఔట్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పచ్చదనం వంటి సౌకర్యాలతో సమగ్ర అభివృద్ధికి కుడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ విధానం భూయజమానులకు కూడా లాభదాయకంగా మారుతుందని, అభివృద్ధి తర్వాత భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని కుడా అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే విధానంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

యూనిసిటీ మోడల్ లేఔట్‌కు ఊపిరి

ఇదే సమయంలో వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలోని ఊనికిచర్ల ప్రాంతంలో మరో కీలక ప్రాజెక్ట్ కొనసాగుతోంది. లావుని పట్టాదారుల భాగస్వామ్యంతో 145 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ‘యూనిసిటీ మోడల్ లేఔట్’ను కుడా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. అవసరమైన రోడ్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, భవిష్యత్తు పట్టణ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వ సంస్థలతో పాటు భూయజమానులు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల పట్టణ విస్తరణ క్రమబద్ధంగా జరిగే అవకాశం ఉందని కుడా భావిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని భూయజమానులు ముందుకు వచ్చే అవకాశముందని, హనుమకొండ జిల్లాలో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.