epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సైకిళ్లపై ప్రచారం చేయండి!

సైకిళ్లపై ప్రచారం చేయండి!
అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన
ఆరోగ్యంతో పాటు ప్రజల్లో వ్యాయామ స్పృహ
అభివృద్ధి పనులే కాంగ్రెస్ గెలుపుకు బలం
కొల్లాపూర్‌లో ఇంటింటి ప్రచారం జోరు

కాక‌తీయ‌, కొల్ల‌పూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రధాన బలమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పనులు ప్రజల మన్ననలు పొందుతున్నాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొల్లాపూర్ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పెబ్బేటి శేఖర్ గెలుపు కోసం మంత్రి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ తిరుగుతూ ప్రజలను నేరుగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, గత ప్రభుత్వ పాలనకు – ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించారు. ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ… కేవలం ఓట్లు అడగడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడం ముఖ్యమన్నారు. పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఓటర్లలో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు.

సైకిల్‌పై ప్రచారం – వినూత్న పిలుపు
ప్రచార సమయంలో మంత్రి జూపల్లి అభ్యర్థులకు ఆసక్తికరమైన, వినూత్న సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, అందుకోసం ప్రచారంలో మోటార్ బైక్‌లకు బదులు సైకిళ్లను ఉపయోగించాలని సూచించారు. “అభ్యర్థులు సైకిళ్లపై తిరిగి ప్రచారం చేస్తేనే నేను కూడా ప్రచారానికి వస్తా” అని స్పష్టంగా చెప్పారు. సైకిల్ తొక్కడం వల్ల అభ్యర్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ప్రజల్లో వ్యాయామం పట్ల అవగాహన పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోయిందని, వ్యాయామంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు ఆదర్శంగా నిలిచి సైకిల్ ప్రచారం చేపడితే యువతలోనూ మంచి సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కొల్లాపూర్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం కాంగ్రెస్ సర్కారు...

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనపర్తి జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ...

Kondareddypalli: సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి శ్రీ...

Child Tragedy: విషాదం.. మట్టి గోడ కూలి బాలుడు మృతి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో...

సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ...

Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు...

రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: జూపల్లి సంచలన వ్యాఖ్యలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహం...

వలసల పాలమూరును విద్య, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, మహబూబ్‌నగర్ : దశాబ్దాల కరవు, వలసలు, వెనుకబాటుతనం నుంచి బయటపడి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.