epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భద్రకాళి బండ్‌పై అంతరిక్ష సంబరం

భద్రకాళి బండ్‌పై అంతరిక్ష సంబరం
‘ఎక్స్‌ప్లోరా–2026’కు ఘనంగా శ్రీకారం
ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు స్టార్ గేజింగ్ కార్యక్రమాలు
నాలుగు ప్రొఫెషనల్ టెలిస్కోపులతో చంద్రుడు, గ్రహాల పరిశీలనకు అవకాశం
రుద్రమ వి.01 మోడల్ రాకెట్ ప్రయోగం ప్రధాన ఆకర్షణ
ఇస్రో మిషన్ గ్యాలరీతో అంతరిక్ష ప్రయాణం ప్రత్యక్ష అనుభూతి
విద్యార్థుల్లో శాస్త్రం, రాకెట్రీపై ఆసక్తి పెంపే లక్ష్యం
వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పం
కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాకతీయ, వరంగల్ బ్యూరో : జాతీయ సైన్స్ డే సందర్భంగా వరంగల్ నగరంలో అంతరిక్ష విజ్ఞానానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ‘ఎక్స్‌ప్లోరా–2026 స్పేస్‌స్టెమ్ డ్రైవ్’లో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు వరంగల్ భద్రకాళి బండ్ వద్ద ప్రజల కోసం ప్రత్యేక స్టార్ గేజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కుడా ఆధ్వర్యంలో, ఏటిడిఆర్‌ఎల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, ఇస్రో రిజిస్టర్డ్ స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి, ఎన్‌ఐటి వరంగల్ అకడమిక్ భాగస్వామ్యంతో, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. కుడా వైస్ ఛైర్మన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయి, ఎన్‌ఐటి డైరెక్టర్ బిద్యాధర్ సుబుద్ధి, ఇస్రో–ఎన్‌ఐటి నోడల్ అధికారి ఆంజనేయులు కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

టెలిస్కోపులతో ప్రత్యక్ష ఖగోళ వీక్షణ

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా నాలుగు ప్రొఫెషనల్ ఖగోళ టెలిస్కోపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలు, విద్యార్థులు చంద్రుడు, గ్రహాలు మరియు లోతైన ఆకాశ వస్తువులను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఇస్రో మిషన్ గ్యాలరీలో రాకెట్ మోడల్స్, ఉపగ్రహ నమూనాలు ప్రదర్శిస్తూ భారత అంతరిక్ష ప్రయాణాన్ని సులభంగా అర్థమయ్యేలా చూపిస్తున్నారు. ఈ స్పేస్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా “రుద్రమ వి.01” మోడల్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థులు, ప్రజలకు రాకెట్లు ఎలా పనిచేస్తాయో అర్థమయ్యేలా రూపొందించిన విద్యాపరమైన నమూనా. ఈ ప్రయోగం ద్వారా పిల్లల్లో శాస్త్రంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు “నేనూ రాకెట్ తయారు చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రాకెట్రీ, ఉపగ్రహ రూపకల్పన, రోవర్ కాన్సెప్ట్లు, భవిష్యత్ అంతరిక్ష నివాసాలపై అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలను కూడా ఈ శాస్త్రయాత్రలో భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం

ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ సుమారు 8 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా, 2033 నాటికి ఇది 44 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అంతరిక్ష విద్యను విస్తరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని, ఎక్స్‌ప్లోరా కార్యక్రమాన్ని దీర్ఘకాలికంగా కొనసాగిస్తూ వరంగల్‌ను అంతరిక్ష విద్య, పరిశోధన మరియు తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.