epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజ్యసభ‌లో ఎవ‌రికి ఛాన్స్‌..?

రాజ్యసభ‌లో ఎవ‌రికి ఛాన్స్‌..?
రెండు స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
జీవన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న సంకేతాలు
వైఎస్‌ షర్మిల పేరు కూడా చర్చల్లోకి రావడంతో ఆసక్తి
స్థానికులకు ప్రాధాన్యమా.. జాతీయ నేతలకు అవకాశమా?
సామాజిక సమీకరణాలపై అధిష్టానం కసరత్తు
కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. 2026 రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేగం పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల జగిత్యాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా, ఆయనను బుజ్జగించేందుకు రాజ్యసభ సీటు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నాయకుడిగా జీవన్‌రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

షర్మిల పేరు కూడా చర్చల్లోకి.. సమీకరణాలపై కసరత్తు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో ఆమెను ఇతర రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆమెను ఎంపిక చేసే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు చెందిన నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మనూ సింగ్‌వీని రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాకపోవడంతో రాష్ట్ర నాయకుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసారి స్థానిక నాయకుడికి అవకాశం ఇస్తారా లేక మళ్లీ జాతీయ నాయకుడిని ఎంపిక చేస్తారా అన్నది కీలకంగా మారింది.

సామాజిక సమీకరణాలే కీలకం

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకుడిని ఎంపిక చేస్తారా లేక జాతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇలా

నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
నామినేషన్ల దాఖలు చివరి తేదీ: మార్చి 5, 2026
నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 9, 2026
పోలింగ్: మార్చి 16, 2026 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు)
ఫలితాల ప్రకటన: మార్చి 16, 2026 (సాయంత్రం 5 గంటలకు)

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.