epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!
స్టేష‌న్‌కు చేరుకున్న కుంభ‌మేళా బ్యూటీ ల‌వ్ మ్యాట‌ర్‌
తండ్రి బలవంతపు పెళ్లి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌
రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ
మేజర్ కావడంతో ఆమె నిర్ణయానికే ప్రాధాన్యమ‌న్న పోలీసులు
త్వరలోనే ప్రియుడితో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం

తిరువనంతపురం : కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి తనను బలవంతంగా మరొకరితో పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ కల్పించాలని కోరింది. మోనాలిసా భోస్లే 2024 కుంభమేళా సమయంలో పూసల మాలలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలతో ఒక్కసారిగా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రేమగా మారింది

మోనాలిసా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల నిమిత్తం మోనాలిసా కేరళలో ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలోనే బుధవారం ఉదయం ఆమె తన ప్రియుడితో కలిసి తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తన ఇష్టానికి విరుద్ధంగా మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిపింది.

పోలీసుల కౌన్సెలింగ్

మోనాలిసా మేజర్ కావడంతో ఆమె తన ఇష్టానుసారం జీవించవచ్చని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోనాలిసా తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. త్వరలోనే వీరిద్దరూ కేరళలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.