epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు
చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలింపు
టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్ ఆధ్వర్యంలో దాడి
గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అరెస్ట్
70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టిక స్వాధీనం
లారీ సీజ్ చేసి.. కేసు నమోదు

కాకతీయ, మహబూబాబాద్ : గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమ రవాణాపై పోలీసులు కట్టడి చర్యలు చేపట్టగా భారీ సరుకు పట్టుబడింది. చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలిస్తున్న నల్లబెల్లం, పట్టికను కురవి మండలం సోమ్లా తండా వద్ద అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు కురవి శివారులోని సోమ్లా తండా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన లారీని ఆపి పరిశీలించారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టిక బయటపడటంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్

ఈ ఘటనలో గుగులోత్ సుమన్ , ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నల్లబెల్లాన్ని నాటు సారా తయారీ కేంద్రాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రవాణాకు ఉపయోగించిన లారీని కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కురవి పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ సారాయి తయారీ, రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్ఐ తాహేర్ బాబా, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ జయకుమార్‌తో పాటు సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు. అక్రమ వ్యాపారాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.