epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం
ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించాం
పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య పెంపు
నగరానికి ట్యాంక్‌బండ్ తరహా సౌందర్యం
సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు మేలు
దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చిన్న వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అమృత్ పథకం కింద చేపట్టిన ఈ పనులతో చెరువుల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. చెరువులు కేవలం నీటి నిల్వలకే పరిమితం కావని మంత్రి వివరించారు. అవి భూగర్భ జలాల పెంపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నగరంలోని చెరువులను ట్యాంక్‌బండ్ తరహాలో తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఉర్సు రంగసముద్రం, దేశాయిపేట చెరువుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల వల్ల విద్యార్థుల హాజరు, ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.

ఉపాధి, అభివృద్ధి రెండింటిపై దృష్టి

టెక్స్టైల్ పార్క్ నేపథ్యంలో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆధునిక కుట్టు యంత్రాలపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనులు నగరాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ పనులతో ప్రజలకు శుభ్రమైన వాతావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు సురేష్ జోషి, మరుపల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.