ప్రజా సమస్యలను పరిష్కరించాలి
బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్
బల్దియా గ్రీవెన్స్‌కు 104 ఫిర్యాదులు
విభాగాల వారీగా దరఖాస్తుల స్వీకరణ
కాకతీయ, వరంగల్ : ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. బల్దియా కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 104 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ వాటిని స్వీకరించి సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు పరిష్కార నిమిత్తం అందజేశారు. ఫిర్యాదుల వివరాలు పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి 46, ఇంజనీరింగ్ విభాగానికి 33, రెవెన్యూ విభాగానికి 18, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి 05, హార్టికల్చర్ విభాగానికి 02 చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఫిర్యాదును గమనించి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ శంకర్ లింగం, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, వెటర్నరీ వైద్యులు డా. గోపాల్ రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డా. రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

