విద్యార్థిని అర్చనకు ఎంపీ రవిచంద్ర అభినందనలు
మెరుగైన మార్కులు సాధించడంపై హర్షం
కాకతీయ, హనుమకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని అర్చనను రాజ్యసభ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ వ్యక్తిగత సహాయకుడు వీణవంక కిరణ్ కుమార్ కుమార్తె అయిన అర్చన, హనుమకొండలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. విజయం సాధించిన సందర్భంగా అర్చన తన తండ్రి కిరణ్ కుమార్‌తో కలిసి ఎంపీ రవిచంద్రను, ఆయన సోదరుడు కిషన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ విద్యార్థినికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత విద్యనభ్యసించి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

