చర్లపల్లిలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
పార్టీ జెండాను ఆవిష్కరించిన శీలం దేవేందర్
తెలంగాణ సాధన కేసీఆర్ త్యాగాల ఫలితం
కాకతీయ, నడికూడ: మండలంలోని చర్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు శీలం దేవేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కేసీఆర్ చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితమేనని కొనియాడారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నందికొండ గణపతి రెడ్డి, బీముడి నాగిరెడ్డి, నందికొండ జయపాల్ రెడ్డి, సర్పంచ్ బండి రేణుక శంకర్, ఉప సర్పంచ్ మామిడాల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు పొడిశెట్టి బ్రహ్మం, శీలం రాకేష్, పర్శవేణి స్వరూప, బన్వారీ ఏకేష్, ముష్కే రాము, భద్రయ్య, మెంబర్ మొగిలి తదితరులు హాజరయ్యారు.

