epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మక్క రైతుకు తప్పని ‘గోస’

మక్క రైతుకు తప్పని ‘గోస’
దిగుమతి లేక‌ గోదాంల వ‌ద్ద అరిగోస!
రోజుల తరబడి వాహనాల క్యూలు..
తిండి తిప్పలు లేక రైతుల పడిగాపులు!
హమాలీల కొరతతో నిలిచిన దిగుమతి ప్రక్రియ
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం!
ఆరుగాలం శ్రమించినా అమ్ముకోవడానికి తప్పని పోరాటం!
గుండ్లపహాడ్ గోదాం వద్ద వారం రోజులుగా నిలిచిన వందలాది వాహనాలు!
నత్తనడకన సాగుతున్న అన్-లోడింగ్..
రైతుల ఆవేదనను పట్టించుకోని గోదాం ఇన్‌చార్జి!
తక్షణ చర్యలు తీసుకోకపోతే ధర్నా తప్పదు
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి హెచ్చరిక!

కాక‌తీయ‌, న‌ల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇప్పుడు ‘అడవి కాసిన వెన్నెల’లా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వస్తే.. అక్కడ రైతన్నకు చుక్కెదురవుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు ధాన్యం చేరుతున్నప్పటికీ, అక్కడ దిగుమతి ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో రైతులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. గుండ్లపహాడ్ గోదాం వద్ద వారం రోజులుగా వాహనాలు బారులు తీరి ఉండటంతో, అటు రైతులు.. ఇటు డ్రైవర్లు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్న దుస్థితి నెలకొంది. నల్లబెల్లి కొనుగోలు కేంద్రంలో సేకరించిన మొక్కజొన్న బస్తాలను గుండ్లపహాడ్ గోదాముకు తరలిస్తున్నా, దిగుమతి విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వందల సంఖ్యలో వాహనాలు గోదాం ముందు వేచి ఉన్నా, తక్కువ సంఖ్యలో హమాలీలతో పని చేయించడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా తిండి, నిద్ర లేక అక్కడే ఉంటున్నామని, అయినా గోదాం ఇన్‌చార్జికి తమ బాధలు పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే రైతుల ఈ అరిగోసకు కారణమని స్పష్టమవుతోంది.

పెరగనున్న నిరసన జ్వాలలు!

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి ఘాటుగా స్పందించారు. రైతులు ఇప్పటికే 20 రోజులుగా పంట అమ్ముకోవడానికి నిరీక్షిస్తున్నారని, గోదాం వద్దకు వచ్చాక కూడా వారం రోజులుగా వాహనాలు ఖాళీ కాకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. వాహనాలు రోజుల తరబడి నిలిచిపోవడంతో పెరుగుతున్న వెయిటింగ్ ఛార్జీల భారాన్ని రైతులు మోయలేరని, ఆ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే హమాలీల సంఖ్యను పెంచి దిగుమతిని వేగవంతం చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి గుండ్లపహాడ్ గోదాం వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.

సర్కారు స్పందిస్తుందా..? మిన్నకుండిపోతుందా?

పంటను పండించడమే ఒక ఎత్తు అయితే, దానిని అమ్ముకోవడానికి కూడా పోరాటాలు చేయాల్సి రావడం తెలంగాణ రైతులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన దిగుమతి ప్రక్రియను పూర్తి చేసి, తమను ఇళ్లకు పంపాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి రైతుల పక్షాన నిలబడతారో లేదో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.