epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డంపింగ్ యార్డుతో నగర ప్రజల నరకయాతన

డంపింగ్ యార్డుతో నగర ప్రజల నరకయాతన
పొగ‌తో ప్ర‌జ‌లు అనారోగ్యం పాల‌వుతున్నా ప‌ట్ట‌దా..?
టెండర్లు తెరవడానికి చేతులకు రోగం పుట్టిందా?
అధికారుల తీరుపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ధ్వజం
ప్రశ్నిస్తే కార్పొరేటర్లపై కేసులు పెడుతున్నారంటూ ఆరోప‌ణ‌లు

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డ్ సమస్యతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మున్సిపల్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగ, మంటలు, దుర్వాసనతో ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

టెండర్లలో ‘పే మిషన్’ ఏది?
చెత్త వేరు చేయడం, తరలింపు ప్రక్రియ కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ. 2 కోట్లు మంజూరైనప్పటికీ, ఇప్పటి వరకు టెండర్లు ఎందుకు ఓపెన్ చేయలేదని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. “టెండర్లు తెరవడానికి అధికారుల చేతులకు రోగం పుట్టిందా?” అంటూ ఘాటుగా విమర్శించారు. టెండర్ల ఆలస్యానికి ‘పే మిషన్’ కుదరకపోవడమే కారణమని ఆరోపించారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకే మళ్లీ పనులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చేయని పనులకు కూడా బిల్లులు మలచుకోవడంలోనే అధికారులు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులతో భయపెడతారా?
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం దారుణమని రవీందర్ సింగ్ అన్నారు. ప్రజాప్రతినిధులు గళమెత్తితే అణచివేతకు పాల్పడుతున్నారని, అదే సమయంలో అధికారులను దుర్భాషలాడిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై తాను ఫిర్యాదు చేసి రెండేళ్లు గడిచినా ఇంతవరకు విచారణ జరగలేదని ఆరోపించారు. అవినీతి చేసిన అధికారుల జాబితా తన వద్ద ఉందని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

ఉద్యమం తప్పదు..
కేంద్ర, రాష్ట్ర మంత్రులు సందర్శించినా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. కలెక్టర్, కమిషనర్ వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. అధికారులు అవినీతికి పాల్పడలేదని నమ్మకం ఉంటే.. మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏకమై అధికారుల అక్రమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.