epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దుమ్ముగూడెంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల
స్టేడియం నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాం
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాక‌తీయ‌, కొత్త‌గూడెం : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మండలంలోని బండిరేవు గ్రామంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల’ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, హాస్టల్ వసతులతో నిర్మించనున్న ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రహదారుల అభివృద్ధి.. క్రీడలకు ప్రోత్సాహం
చింతగుప్ప గ్రామం నుండి బురదమడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు గణనీయమైన ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ములకపాడు గ్రామంలోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్‌తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

వారం రోజుల్లోనే రైతులకు నగదు
మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తున్నామని, మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, రెండో విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ, ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.

అభివృద్ధికి బాటలు : కలెక్టర్, ఎమ్మెల్యే
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎస్‌పి రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.