కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు ఉండాలి
మాస్టర్జీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ ఎస్. సుందర్ రాజు
మాస్టర్జీ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయ సాధికారత సదస్సు
ప్రిన్సిపాల్స్‌కు ప్రత్యేకంగా ‘ఎన్‌రిచ్‌మెంట్ ప్రొగ్రాం’
కాకతీయ, హన్మకొండ : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే దిక్సూచలని, నిరంతర అభ్యాసం ద్వారానే బోధనలో నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకోవచ్చని మాస్టర్జీ విద్యాసంస్థల చైర్మన్, కూడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉపాధ్యాయ శిక్షణ, కంటెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్’ ఆధ్వర్యంలో మాస్టర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక ‘ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ హెడ్స్ ఆఫ్ స్కూల్స్’ సదస్సు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా విచ్చేసిన లక్ష్మీ రావు, వి. నిరంజన్ శాస్త్రిలు ప్రధాన ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఆధునిక విద్యా విధానంలో వస్తున్న మార్పులు, తరగతి గదిలో విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం మరియు వినూత్న బోధనా పద్ధతులపై వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా శైలిని మార్చుకోవాలని, పాఠశాల సర్వతోముఖాభివృద్ధిలో అడ్మిన్ టీమ్, అకాడమిక్ టీమ్ సమన్వయంతో కలిసి పనిచేయాలని వారు సూచించారు. ఈ సదస్సులో మాస్టర్జీ గ్రూప్‌కు చెందిన ఐదు పాఠశాలల ప్రిన్సిపాల్స్ డి. రజిత, పిల్లి కళ్యాణ్, శశిధర్, సునీల్, వైస్ ప్రిన్సిపాల్స్ రాధికా, శిరీషా జంగం, రేకులపల్లి లావణ్య, అయేషా, కో-ఆర్డినేటర్లు సంయుక్త, లంక లావణ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే. నాగరాజు మరియు అడ్మిన్ సిబ్బంది పాల్గొన్నారు.

