epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆల‌యాలను కూల్చి చ‌రిత్ర హీనుల‌య్యారు

ఆల‌యాలను కూల్చి చ‌రిత్ర హీనుల‌య్యారు
ఘటనపై తక్షణ విచారణ జరపాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయ విధ్వంసంపై ఆగ్ర‌హం
కాకతీయ, ఖానాపురం: నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక శివాలయాన్ని ధ్వంసం చేయడంపై నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ధ్వంసమైన ఆలయ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. చరిత్రహీనులు మాత్రమే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతారని మండిపడ్డారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని, అభివృద్ధి పేరుతో చారిత్రక కట్టడాలను కూల్చివేయడం అవివేకమని ధ్వజమెత్తారు.
కమిషన్ల కోసమే కూల్చివేతలు
క్రీ.శ. 1213 కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని అర్ధరాత్రి వేళ కూల్చివేస్తుంటే పురావస్తు శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ స్థలాన్ని ఉపయోగించాలనుకున్నా, ఆలయ ప్రాధాన్యతను గుర్తించి వెనక్కి తగ్గాయని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల లాభాలు, స్థానిక నాయకుల కమిషన్ల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకట నారాయణ, కౌన్సిలర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.