లారీలు లేవు..కొనుగోళ్లు కావు…!
గుట్టలుగా పేరుకుపోయిన మక్కలు
గత్యంతరం లేక..గన్ని సంచులు కొనుగోలు
ప్రభుత్వ ముందు చూపు లేకనే రైతుల కళ్ళలో కన్నీరు
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
వారం రోజుల్లో మొక్కలు కొనుగోళ్లు పూర్తి చేయాలి
లేదంటే 5,000 మందితో ధర్నా చేస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ,రాయపర్తి : మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శుక్రవారం మక్కల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆయన బైఠాయించారు.తెలంగాణ క్రీడా మైదానంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఎర్రబెల్లికి చేరవాణిలో సమాచారం అందించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం త్రాగునీటి వసతి లేదని, డబ్బులు ఇచ్చిన వారికే కాంటాలు నిర్వహిస్తున్నారని తమ గోడును వెల్లబోసుకున్నారు.లారీలు రావడంలేదని, కొనుగోళ్లలో అలసత్వం వహిస్తున్నారని వాపోయారు.సమాచారం అందుకున్న ఎర్రబెల్లి హుటాహుటిన రాయపర్తి మండలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదురుగా భారీ ధర్నా నిర్వహించారు.ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ముత్యం రాజేందర్ నిరసనకారులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వివరించడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో మొక్కలు గుట్టలుగా పేరుకపోయాయని మండిపడ్డారు. లారీల కొరత కారణంగా తూకం వేసిన బస్తాలను కూడా తరలించలేకపోతున్నారని,దీంతో వారాల తరబడి రైతులు కేంద్రాల్లోనే కాపలా ఉండాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉందన్నారు.రైతులకు కనీసం నీడ, త్రాగునీటి సదుపాయం కల్పించడం లేదని ఆరోపించారు. అకాల వర్షం వస్తే మొక్కలు తడిసి ముద్ద అవుతాయి.. అప్పుడు బాధ్యత ఎవరిది? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కన్నీళ్ళకు కారణమైన ఈ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని, రైతులకు న్యాయం జరిగే వరకు విశ్వమించబోమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వారం రోజుల్లో మొక్కల కొనుగోలు పూర్తి చేయాలని లేదంటే… 5000 మందితో భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

