మిల్లర్ల సమస్యలపై కలెక్టర్‌కు విన్నపం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హేమంత్ బోర్కడేను సోమవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాధం ప్రవీణ్ నేతృత్వంలోని సభ్యులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడిన అసోసియేషన్ సభ్యులు, జిల్లాలోని రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని బాధం ప్రవీణ్ కోరారు.
మిల్లర్ల విన్నపాలపై కలెక్టర్ హేమంత్ బోర్కడే సానుకూలంగా స్పందించారు. జిల్లాలో ధాన్యం సేకరణ, మిల్లింగ్ సజావుగా సాగేందుకు మిల్లర్ల సహకారం అవసరమని పేర్కొంటూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సహోదర రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షులు కాసిడి సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి డేగల భద్రయ్య, గౌరవ సలహాదారులు రామిని శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

