సర్కారు బడుల్లోనే చేర్పించాలి
విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటో సౌకర్యం
చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి
గంగిరెద్దుల, నంబర్-1 కాలనీల్లో ‘బడిబాట’
కాకతీయ, చెన్నారావుపేట, : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని గంగిరెద్దుల కాలనీ, నంబర్-1 కాలనీలలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మానుపాటి పాపమ్మ, ఉపసర్పంచ్ దొంతి శ్రీనివాస్, వార్డు సభ్యుడు ఈసంపల్లి ఐలయ్య, ఉపాధ్యాయులు వేముల కిషోర్, పోలేపల్లి రవి, రజిని, శ్రీనివాస్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

