ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
డీఆర్డీఓ పీడీ మేన శ్రీను
చర్లపల్లి గ్రామంలో పనులు పరిశీలన
కాకతీయ, నడికూడ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ఈదులకుంట చెరువులో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను బుధవారం రోజు నడికూడ ఎంపీడీవో రామక్రిష్ణ తో కలిసి డిఆర్డిఓ పిడి మేన శీను ఉపాధిహామీ పనులను పరిశీలించారు. అనంతరం కూలీలకు కల్పిస్తున్న కనీస వసతుల గురించి ఆరా తీశారు, అలాగే మట్టి పనులలో నాణ్యత పరిమాణాలు పాటించే విధంగా పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు పెరిగిపోవడంతో కూలీలు వడదెబ్బ తగలకుండా ఉదయం పూట పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలని వారికి సూచించారు. వంద రోజుల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా ఉందని ఇలాగే కొనసాగించాలని అధికారులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, శ్రీధర్ రావు, సర్పంచ్ బండి రేణుక, ఉప సర్పంచ్ ఎం శ్రీనివాసరెడ్డి, ఏపీవో ఇందిర, ఈసీ రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శి నాసం అరుణ్ కుమార్, టి ఏ కుసుమ, ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్లపల్లి ప్రభాకర్, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

