ప్రత్యామ్నాయం చూపించాకే తొలగించాలి
చిరు వ్యాపారుల పొట్టకొట్టడం అన్యాయం
సంఘం అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి ఆవేదన
కాకతీయ, వరంగల్: వరంగల్ హెడ్ పోస్టాఫీస్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా కొన్నేళ్లుగా సాగుతున్న చిరు వ్యాపారాలను ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నపళంగా తొలగించడం సరికాదని చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి అన్నారు. జేసీబీలతో భయభ్రాంతులకు గురిచేస్తూ దుకాణాలను తొలగించడం బాధాకరమన్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా వ్యాపారాలు బంద్ చేయిస్తే వారి కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వం ఒక దారి చూపించే వరకు ప్రస్తుత స్థలాల్లోనే వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

