అటవీ భూముల సమస్యలపై కలెక్టర్ ఆరా
చెన్నారావుపేట మండలంలో కలెక్టర్ సత్య శారద పరిశీలన
సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అటవీ అధికారులకు ఆదేశం
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలంలోని ఝల్లి, తిమ్మరాయినిపహాడ్, ఎల్లాయిగూడెం గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూముల సమస్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. భూముల హక్కులు, సాగు పరిస్థితులు, స్థానిక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో కలిసి కలెక్టర్ ఆరా తీశారు. సమస్యలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి నికిత, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డీసీఓ నీరజ, తహసీల్దార్ మహమ్మద్ ఆబిద్ అలీ, సర్వే ల్యాండ్స్ ఏడీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

