అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
లక్ష్మీపురం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాం
మహబూబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్
రూ.1.47 కోట్ల తో ఫార్మేషన్ రోడ్డు పైలాన్ ఆవిష్కరణ
కాకతీయ,ఇనుగుర్తి : రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు .లక్ష్మీపురం నుంచి చిన్న ముప్పారానికి సరైన రోడ్డు లేకపోవడంతో ఆ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థన మేరకు రోడ్డు మంజూరి చేసి గ్రామస్తుల కల నెరవేర్చామన్నారు.రూ.1 కోటి 47 లక్షలతో నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు చెందిన పైలాన్ ను ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు బానోతు రేణుక నరేష్ నాయక్,రాయలి భవాని శేఖర్, మీటు,డిసిసి ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తదితర ప్రభృతులతో కలిసి ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం స్థానిక సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లో దూసుకుపోతోందని ఈ క్రమంలో లక్ష్మీపురంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను అన్నారు. స్థానిక నేత ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిరంతరం తనను సంప్రదిస్తాడని ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ని అభినందించారు.అంతకుముందు శ్రీనివాసరెడ్డి గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు. విద్యుత్ సమస్య 80% తీరిందని. సిసి రోడ్లు కూడా కేటాయించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సోనీ, పంచాయతీ కార్యదర్శి మణిదీప్, జి పి ఓ దివ్య, ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము,వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు సతీష్, సీనియర్ నేత లు కర్నెకంటి వెంకటరెడ్డి,కారుపోతుల సురేష్ తో పాటు పార్టీ జిల్లా, మండల,వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

