epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బల్దియా ‘డౌట్’సోర్సింగ్!

బల్దియా ‘డౌట్’సోర్సింగ్!
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుపై ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన
సంక్షేమ పథకాల్లో లబ్ది పొందలేకపోతున్నామని ఆందోళన
కాదని నిరూపించుకునేందుకు నిత్యం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు
తన తల్లికి పింఛన్ మంజూరు కావడం లేదని ఓ ఉద్యోగి నిర్వేదం

కాకతీయ, వరంగల్ : ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వం ద్వారా ఎంపికయ్యారా? ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎంపికయ్యారా? లేదా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులా? అనేది సాధారణ ప్రజలకు సంశయమే. కానీ, ఇక్కడ ఉద్యోగులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది గుర్తింపుపై వారే ముక్కున వేలేసుకుంటున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతూ.. సమస్యను పరిష్కరించాలని నిత్యం ఆఫీసు చుట్టూ, అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులా?
ఏ ప్రభుత్వ కార్యాలయమైనా కింది స్థాయి సిబ్బంది ఎక్కువ శాతం కాంట్రాక్ట్ బేసిక్ పైన పని చేస్తుంటారని తెలిసిందే. వారి వేతనాలు, ఇతర అలవెన్సులు వేరుగా ఉంటాయి. అయితే, వరంగల్ బల్దియాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా సాగుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇదే వారికి శాపంగా మారినట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా ప్రైవేటు జాబ్ కిందే లెక్క, వీరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో లబ్ది పొందే అవకాశం ఉంటుంది. అయితే, బల్దియాలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రికార్డుల్లో నమోదు కావడంతో వారు, వారి కుటుంబ సభ్యులు సంక్షేమ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. దీంతో ఆయా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తన తండ్రి మూడేళ్ల క్రితం మరణించగా, తాను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందిన కారణంగా.. తన తల్లికి విడో పెన్షను మంజూరు చేయడం లేదని ఓ ఉద్యోగి వాపోయాడు. ఇంకా వరంగల్ బల్దియాలో పని చేస్తున్న పలువురు పీహెచ్ సిబ్బంది ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ పథకాల్లో అనర్హులుగా గుర్తించడం పట్ల వీరు తీవ్ర మనోవ్యథకు గురవుతున్నారు.

సర్టిఫైడ్ కాపీల కోసం..
ఈ నేపథ్యంలో పీహెచ్ ఉద్యోగులు తాము ఔట్సోర్సింగ్ సిబ్బంది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీరి గుర్తింపు విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ, ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని మథన పడుతున్నారు. ఇదే క్రమంలో తాము ఔట్సోర్సింగ్ సిబ్బంది అని సర్టిఫైడ్ కాపీలు పొందడానికి బల్దియా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించి.. ఒక్కొక్కరికి సర్టిఫైడ్ కాపీ కాపీలు ఇచ్చే బదులు అసలు రికార్డుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులమనే గుర్తింపును తొలగించి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.