epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ల్యాదెల్ల రాజుది సహజ మరణమే

ల్యాదెల్ల రాజుది సహజ మరణమే
పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు
సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లే మృతి చెందినట్లు మెడికల్ రిపోర్ట్
నేరపూరిత చర్యలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు
అనుమానాస్పద మృతి కేసుపై ముగిసిన సమగ్ర శాస్త్రీయ దర్యాప్తు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు అధికారి

కాకతీయ, గీసుగొండ : గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్ రాజు మృతి కేసులో సమగ్ర దర్యాప్తు అనంతరం అది సహజ మరణమేనని తేలినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి, పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 19న ల్యాదెల్ల రాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా.. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 337/2025 కింద కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు.. ఈ కేసు లోతుపాతులను వెలికితీసేందుకు పరకాల డివిజన్ ఏసీపీని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించి అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.

శాస్త్రీయ ఆధారాలతో విచారణ
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల పరిశీలన, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల సేవలను వినియోగించుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వీటితో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్స్ మరియు అనుమానితుల విచారణ తదితర అన్ని సాంకేతిక కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన ప్రతి అనుమానంపైనా ప్రత్యేకంగా విచారణ జరిపామన్నారు.

బాహ్య గాయాలు లేవు.. గుండెపోటే కారణం
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు, హిస్టోపాథాలజీ పరీక్షలు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం వైద్య నిపుణుల తుది అభిప్రాయాల ప్రకారం.. మృతదేహంపై ఎటువంటి ప్రాణాంతక బాహ్య లేదా అంతర్గత గాయాలు లేవని నిర్ధారణ అయిందని ఏసీపీ వివరించారు. శరీరంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు కూడా లభించలేదన్నారు. మృతదేహంపై గమనించిన కొన్ని గుర్తులు మరణానంతర మార్పులు, చీమల కాట్లు మరియు తుమ్మ చెట్టు ముళ్ల కారణంగా ఏర్పడినవేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారన్నారు. చివరగా హిస్టోపాథాలజీ నివేదికల ఆధారంగా ల్యాదెల్ల రాజు ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’ (తీవ్ర గుండెపోటు) కారణంగానే మరణించినట్లు వైద్య నిపుణులు తుది నివేదిక ఇచ్చారని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి హత్య లేదా ఇతర నేరపూరిత చర్యలు జరిగినట్లు ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో దీనిని సహజ మరణంగా నిర్ధారించి కేసును ముగించినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి సీహెచ్ సతీష్ బాబు ప్రకటించారు. ఈ సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, గీసుగొండ సీఐ డీ. విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.