epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేత‌
సివిల్ సప్లైస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ ఆదేశాలిచ్చిన మంత్రి
అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం
బాయిల్డ్ బియ్యం సరఫరాకు అనుమతివ్వాలని డిమాండ్

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలోని రైస్ మిల్లర్లు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైస్ మిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కోరారు. ఈ మేరకు శనివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఆమెకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. మిల్లర్ల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క.. అక్కడికక్కడే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి, వెంటనే తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

ఆరుబయటే ధాన్యం నిల్వలు.. క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం
ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో గత 2024-25 రబీ సీజన్‌లో 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ (ప్రొక్యూర్మెంట్) జరిగిందని గుర్తుచేశారు. అయితే ఈసారి జిల్లాలో అనూహ్యంగా దిగుబడి పెరిగి, రికార్డు స్థాయిలో 1,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన ధాన్యానికి సరిపడా గోదాముల వసతి ములుగు జిల్లాలో లేకపోవడం వల్ల, ప్రత్యామ్నాయం లేక ఆరుబయట ఓపెన్ స్పేస్‌లోనే నిల్వ చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఈ ధాన్యం నాణ్యత (క్వాలిటీ) దెబ్బతిందని, దీనివల్ల ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ముడి బియ్యం (రా రైస్) పాస్ కావడం కష్టతరంగా మారుతుందని వివరించారు.

బాయిల్డ్ బియ్యానికి పర్మిషన్ ఇవ్వాలి
సివిల్ సప్లైస్ అధికారులు వెంటనే స్పందించి, వర్షానికి తడిసి రంగు మారిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అందించేందుకు వీలుగా.. జిల్లాకు ప్రత్యేకంగా ‘బాయిల్డ్ బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద అప్పగించేందుకు అనుమతులు ఇప్పించాలని ప్రవీణ్ కోరారు. తమ సమస్యను వినగానే స్పందించి, ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్కకు ములుగు జిల్లా రైస్ మిల్లర్ల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సహోదరు రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, గౌరవ అధ్యక్షులు పల్లెపాటి సంగిరెడ్డి, గౌరవ సలహాదారులు రాణి శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితర ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.