epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భద్రకాళి చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి

భద్రకాళి చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి
పేదలకు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
వర్షాకాలానికి ముందే భద్రకాళి పనులు పూర్తి చేయాలి
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యంతోనే ప‌నులు ఆలస్యం
మాజీ విప్, బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
29న వరంగల్‌కు కేటీఆర్
3,500 మంది కార్యకర్తలతో భారీ సమావేశం
వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి అత్యంత కీలకమైన, జీవనాడిగా ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులు నెలల తరబడి సాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై మాజీ విప్, బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు ఘోరంగా ముంపునకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాదైనా వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేయకపోతే మళ్లీ అదే ముంపు పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “కాంట్రాక్టర్లకు పాత బిల్లులు చెల్లించకపోవడం వల్లే భద్రకాళి పనులు ఆలస్యమవుతున్నాయి. క్షేత్రస్థాయి పనులను పక్కనబెట్టి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయడంలో నిమగ్నమైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నగరాభివృద్ధిపై అస్సలు చిత్తశుద్ధి లేదు” అని వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఏడాది భద్రకాళి మత్తడి గేట్లు, 100 ఫీట్ల రోడ్డు అండర్ డ్రైన్ గేట్లను సకాలంలో నిర్వహించకపోవడం వల్లే నగరం మునిగిపోయిందని.. ఈ ఏడాదైనా ముందస్తు చర్యలు తీసుకుని వరంగల్‌ను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, భద్రకాళి చెరువు వద్ద వరుసగా జరుగుతున్న మునక ఘటనలు, ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా, తాజాగా మరో యువకుడు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ.. చెరువు వద్ద కనీస రక్షణ, ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ఈనెల 29న వరంగల్‌కు కేటీఆర్: నన్నపునేని నరేందర్
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 29న వరంగల్ పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని 24 డివిజన్ల నుంచి సుమారు 3,500 మంది గులాబీ శ్రేణులు ఈ భారీ భేటీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్ హయాంలో నిరుపేదలకు పంపిణీ చేసిన ఇండ్ల పట్టాలపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నరేందర్ విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో 3,500 పట్టాలు, పశ్చిమలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మరో 5,000కు పైగా పట్టాలు ఇచ్చామని.. పేదలకు పట్టాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఎన్నడూ లేదని స్పష్టం చేశారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పర్యటనతో వరంగల్ జంట నగరాల బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం రాబోతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు దిడ్డి కుమారస్వామి, రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, పులి రజనీకాంత్, నయీమొద్దీన్, మోడం ప్రవీణ్, నర్సింహారావు, గౌస్ ఖాన్, మూటిక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.