- ప్రతి ఓటరు అవసరమైన పత్రాలను సమర్పించాలి
- బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య
కాకతీయ, పెద్దవంగర: అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య కోరారు. శనివారం మండలంలోని ఉప్పరిగూడెం, పోచంపల్లి గ్రామాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు-చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంజయ్, ఉపాధ్యక్షులు వెంకన్న, ఇన్చార్జులు సుధాకర్, సమ్మయ్య, రాంమూర్తి, షార్బుద్దీన్, వేణు, సర్పంచులు వెంకన్న, పటేల్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్, శోభన్, కిషన్ నాయక్, కన్వీనర్లు శ్రీను, బయన్న, ధర్మపాల్, రాజు, వెంకన్న, రాజేందర్, జయరాం, మైబు తదితరులు పాల్గొన్నారు.

