epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్యాష్ కొట్టు..కుర్చీ ప‌ట్టు..!

క్యాష్ కొట్టు..కుర్చీ ప‌ట్టు..!
అమ్మ‌కానికి పీఏసీఎస్ ప‌ద‌వులు
ఆర్థిక అర్హ‌త‌త‌తోనే ప‌ద‌వుల అప్ప‌గింత‌కు రంగం సిద్ధం
ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డ్డ‌మ‌ని చెబుతున్నా.. నీతో కాదంటూ ముఖ్య నేత‌ల‌ తిర‌స్క‌ర‌ణ‌
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియామకాలు?
అధికార పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కుల‌కు అన్యాయం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి
క్షేత్రస్థాయి కార్యకర్తల్లో పెరుగుతున్న ఆందోళన

కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నామినేటెడ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో తీవ్ర చిచ్చు రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నియామకాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను కాదని, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న వారికి, ఎమ్మెల్యేల సిఫార్సు ఉన్న వారికే ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ నియామకాల్లో భారీగా డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని, క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులను సైతం “నీతో కాదంటే నీతో కాదు” అని పక్కనపెడుతూ, ఆర్థిక అర్హత ఉన్న వారికే పదవులను అప్పగించేలా రంగం సిద్ధం చేయడంపై సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందనే ఆవేదన జిల్లావ్యాప్తంగా వినిపిస్తోంది.

గీసుగొండ నుంచి ఆత్మకూర్ వరకు..

గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని ఊకల్ పీఏసీఎస్ చైర్మన్ పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. ఈ సంఘం కోసం భూములిచ్చిన నిర్వాసిత కుటుంబాలకు, గతంలో సహకార సంఘంలో పనిచేసి రైతు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే, పార్టీ పెద్దల నిర్ణయం అందుకు భిన్నంగా ఉండటంతో కార్యకర్తల్లో అయోమయం మొదలైంది. మరోవైపు, హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో పీఏసీఎస్ చైర్మన్ పదవి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక నాయకులను పక్కనపెట్టి, ఎమ్మెల్యే తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు భవిష్యత్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

నియామకాల్లో పారదర్శకత ఎక్కడ?

ఇటీవలి కాలంలో పీఏసీఎస్ పదవులను భవిష్యత్ రాజకీయాలకు సోపానాలుగా భావిస్తుండటంతో పోటీ తీవ్రమైంది. రాజకీయ సిఫార్సులు, వర్గపోరాటాలకు అతీతంగా నిజాయితీపరులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. విద్యావంతుడైన యువ నాయకుడికి అవకాశం కల్పిస్తేనే, రైతు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి సహకార వ్యవస్థలో పారదర్శకతను తీసుకురాగలరని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లో సాగుతున్న ఈ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, ఎవరికి పదవులు దక్కుతాయో, ఎవరికి నిరాశ ఎదురవుతుందోనన్న ఉత్కంఠ జిల్లా రాజకీయాల్లో నెలకొంది. రాజకీయ లబ్ధి కోసం పార్టీని నమ్ముకున్న వారిని బలి చేయొద్దని కార్యకర్తలు అధిష్టానాన్ని వేడుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.