- : కల్నల్ ఎస్.ఎస్. రామదురై
- కాకతీయ వర్సిటీలో ఘనంగా ఎన్సీసీ క్యాంపు
- పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘క్యాట్-4 శిక్షణ
కాకతీయ, హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పది రోజుల క్యాట్-4 శిక్షణ శిబిరం తొమ్మిదవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్యాంపు కమాండెంట్ కల్నల్ ఎస్.ఎస్. రామదురై ఓపెన్ గ్రీన్ ఆడిటోరియంలో క్యాడెట్లనుద్దేశించి మాట్లాడారు. ఎన్సీసీ ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ, సమైక్యతా భావం, నాయకత్వ లక్షణాలు, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. భారత ఆర్మీ చరిత్ర, డ్రిల్లు, మ్యాప్ రీడింగ్ వంటి అంశాలపై క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో నాణ్యమైన శిక్షణ పద్ధతులను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
ప్రత్యేక ఆకర్షణగా వివిధ కార్యక్రమాలు
క్యాంపులో భాగంగా ఉదయం యోగాసనాలతో పాటు, వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి హాజరైన ఏఎన్‌వోలకు విద్యాసంస్థల్లో క్యాడెట్ శిక్షణ, దాని ప్రాధాన్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పీఐ స్టాఫ్ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించారు. తొమ్మిదవ రోజు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు కల్నల్ రామదురై సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పదకొండవ తెలంగాణ బెటాలియన్ ఏఓ, క్యాంపు డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, గ్రూప్ అధికారులు, క్యాంపు అజ్జుడెంట్ కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, ఎస్ఎం జై రామ్ సింగ్, లెఫ్టినెంట్ టి. గణేష్, లెఫ్టినెంట్ బి. జీవన్ పాల్గొన్నారు. అలాగే జూనియర్ కమిషన్డ్ అధికారులు సుతారి, రాజేంద్రన్, సోను, అనిల్ జాదవ్, అజం అలీ, మురళీకృష్ణ రెడ్డి, కమలాకర్, మూర్తి, మారుతి మద్దం, రామ్‌నాథ్, గిత్తే, ప్రవీణ్ డాంగ్రే, ఆఫీస్ సూపరింటెండెంట్ అరుణ, దత్తు పాల్గొన్నారు. ట్రైనింగ్ విభాగం నుంచి కుమారస్వామి, ప్రభావతి, మహేష్, సతీష్, డాక్టర్ రాజీరు, భవాని, సజని, కాత్యాయని, రవీందర్, వెంకట్ తదితరులతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి మొత్తం 613 మంది క్యాడెట్లు ఈ శిక్షణా శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

