epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూనియర్ అసిస్టెంట్ల సీనియారిటీకి మార్గం సుగమం

  • (టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు
  • సీనియారిటీ విధివిధానాల సర్క్యులర్ విడుదలపై ఉద్యోగుల్లో హర్షం
  • 1,865 మంది ఉద్యోగులకు స్పష్టత వచ్చినట్లు టీజీఆర్‌ఎస్‌ఏ వెల్లడి
  • జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృషితో సమస్య పరిష్కారమైందని ప్రశంస

కాకతీయ, వరంగల్ బ్యూరో : జి.ఓ. నంబర్ 81, 85 ప్రకారం జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన 1,865 మంది ఉద్యోగుల సీనియారిటీ ఖరారుకు సంబంధించిన విధివిధానాల సర్క్యులర్ విడుదల కావడంపై తెలంగాణ గ్రామీణ రెవెన్యూ సేవల సంఘం (టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ విడుదలకు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ లచ్చిరెడ్డి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈసంద‌ర్భంగా కొమాండ్ల రాజు మాట్లాడుతూ జి.ఓ. 81, 85 కింద పదోన్నతి పొందిన ఉద్యోగుల సీనియారిటీ అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉండి ఆందోళనకు గురిచేసిందన్నారు. ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో పలుమార్లు చర్చలు జరపడం ద్వారా సీనియారిటీ ఫిక్సేషన్‌కు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేయించడంలో లచ్చిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.

సర్క్యులర్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 1,865 మంది జూనియర్ అసిస్టెంట్ల సీనియారిటీ ఖరారు ప్రక్రియ వేగవంతం కానుందని కొమాండ్ల రాజు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్ పదోన్నతులు, సేవా ప్రయోజనాలు, వేతన సంబంధిత అంశాల్లో స్పష్టత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఎంప్లాయీ ఐడీలు లేక వేలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిచిపోయిన సందర్భంలో లచ్చిరెడ్డి చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి ఎంప్లాయీ ఐడీలు మంజూరు చేయించడంతో పాటు పెండింగ్ వేతనాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు, ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసి రెండో ఇంక్రిమెంట్ అందేలా చేస్తున్న కృషి కూడా అభినందనీయమని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సర్వీస్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలో ఉద్యోగ జేఏసీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొమాండ్ల రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇదే విధంగా కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా టీజీఆర్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు ఎడ్ల రవి, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణాకంటి రాజేష్, నాయకుడు కృష్ణప్రసాద్తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.