కాంగ్రెస్‌లో 50 మంది నాయకుల చేరిక
కడియం శ్రీహరి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, యువకుల చేరిక
కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జక్కుల వీరయ్య, చొక్కం సంపత్, చొక్కం రమేష్, రాజు, నాగరాజు, అజయ్, లింగనబోయిన రమేష్, ఇట్టబోయిన రాజశేఖర్, రాయగిరి సత్యం, పెద్ద వీరయ్య, మోతే రాహుల్, రంజిత్‌తో పాటు మరో పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాలకు చేరువవుతున్నందునే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ ఎంపీపీ బాలరాజు, కొండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

