బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు గౌడ్
కాకతీయ, గీసుగొండ: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద బాలరాజు గౌడ్‌ను నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన డా. కాళీ ప్రసాద్, కొలను సంతోష్ రెడ్డి, డా. విజయ చందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బలవంతుల రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఓబీసీల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

