వంగపహాడ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
కాకతీయ, వరంగల్: గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్‌లో గడవంశీయ కులం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల పెద్దమనిషి ముస్కు వీరేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంగన్‌వాడీ చిన్నారులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అన్నారు. కార్యక్రమంలో ముస్కు రాజమౌళి, ముస్కు వేణు, ముస్కు రాజేంద్రప్రసాద్, కోడెం నరేష్‌బాబు, కాళిదాసు శివ, రాము, వినయ్, గోపు శంకర్, నరసింహ, రంజిత్, రవి, ప్రేమ్, కృష్ణ, శేఖర్, రాజేష్, చిన్నారులు, స్థానికులు పాల్గొన్నారు.

