epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం పర్యటనకు ముస్తాబైన ములుగు

సీఎం పర్యటనకు ముస్తాబైన ములుగు
రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి నేడు శ్రీకారం
గ‌ట్ట‌మ్మ ఆల‌యం వ‌ద్ద రూ.868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ
రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్స‌వం
మేడారంలో వనదేవతలను ద‌ర్శించుకోనున్న సీఎం
అక్క‌డి నుంచే చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం నుంచి ములుగు వరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణం, గట్టమ్మ ఆలయ సమీపంలోని పైలాన్ ప్రాంతం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, హెలిప్యాడ్లు, సీఎం ప్రయాణించే మార్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రూ.16,007 కోట్ల రహదారులకు శ్రీకారం

గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న భారీ కార్యక్రమానికి ములుగు వేదిక కానుంది. రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ములుగు నుంచి ప్రారంభించనున్నారు. తొలి దశలో 2,145 రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గట్టమ్మ ఆలయ సమీపంలో ఇందుకు గుర్తుగా భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు, అలంకరణలు, పారిశుధ్యం, ల్యాండ్‌స్కేపింగ్‌తో పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వీఐపీ రాకపోకలు, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు.

రూ.868 కోట్ల పనుల పైలాన్

ములుగు జిల్లాలో చేపట్టిన రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రతిబింబించే మరో పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం నూతన కలెక్టరేట్ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైలాన్ పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుధ్యం, పార్కింగ్, బారికేడింగ్ తదితర పనులను పూర్తి చేశారు. రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వివిధ శాఖల కార్యాలయాలు, విద్యుత్, జనరేటర్, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలతో భవనాన్ని నిర్మించారు. పరిసరాల్లో ల్యాండ్‌స్కేపింగ్, విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుధ్య పనులను పూర్తి చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, బారికేడింగ్, అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

మేడారంలో వనదేవతల దర్శనం

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణం వరకు రహదారులను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో బారికేడింగ్, క్యూలైన్లు, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, భద్రతా సిబ్బంది, అత్యవసర మార్గాలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిర్మాణ వ్యర్థాలు, గ్రానైట్ రాళ్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ల్యాండ్‌స్కేపింగ్, మొక్కలు, పూలతో ప్రాంగణాన్ని సుందరీకరించారు. మేడారం వేదికగా చేయూత పింఛన్ల లబ్ధిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు పత్రాలను అందజేయనున్నారు. లబ్ధిదారులకు కూర్చునే సదుపాయం, తాగునీరు, వైద్య సహాయం తదితర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

పర్యటన షెడ్యూల్ ఇదీ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మేడారం చేరుకుంటారు. 1.40 నుంచి 1.50 గంటల వరకు సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 2.20 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయ సమీపంలోని పైలాన్ వద్దకు చేరుకుని 2.30 గంటలకు రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 2.40 గంటలకు రూ.868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమాలు ముగించుకుని 3 గంటలకు ములుగు డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరుతారు.

పటిష్ట భద్రత.. సర్వం సిద్ధం

సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం నుంచి ములుగు వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్, అగ్నిమాపక, వైద్య, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.