ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా ..
-బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్
కాకతీయ,ఆత్మకూరు : కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలంలోని పలుగ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు కార్యకర్తలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని పార్టీ కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు నాయకునికి బీజేపీ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉపగాళ్ల శ్రీకాంత్ రెడ్డి, చౌలపల్లి గ్రామ సర్పంచ్ మోరే రాజేశ్వరరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు బలవంతుల రాజు, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ ఎద్దులపురం శ్రవణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ టింగిలికారి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పూజారి రవీందర్, పీసాల సాంబయ్య, కోశాధికారి జక్కుల మహేందర్, బూత్ అధ్యక్షులు యాద కుమార్, కుక్కమూడి కిరణ్, రాచర్ల నరేష్, బొల్లా రమేష్, కోరే కుమారస్వామి, మొద్దూరి పరమేశ్వర్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

