పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి చాటాలి..
కాకతీయ, గీసుగొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గౌడ సంఘం మండల అధ్యక్షుడు వల్గుల సారంగపాణి అన్నారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ బహుజనుల కోసం పోరాడి, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీ యమన్నారు.ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కోల వెంకట స్వామి, పెరుమాండ్ల ప్రవీణ్,ఎరుకొండ కొమురెల్లి,ఎరుకొండ వసుదేవుడు, బత్తిని భాస్కర్,సట్ల శ్రీనివాసు,కోల బుచ్చిబాబు,బుర్ర ఆగయ్య,శ్రీను, యాదగిరి,దూలం శ్రీకాంత్,దేశిని అనిల్,గండు రాజు,దూలం బుచ్చి మధు,బుచ్చి బాబు,దూలం రాకేష్,సునీల్,కుమార్,రమేష్, రాజు,విలాస్,శ్రావణ్, కుమార్, నరేష్,కుమార స్వామి,ప్రశాంత్, సంతోష్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

